Wednesday, November 20, 2024

Big Story: నేడు ఇంటర్నేషనల్ యూత్ డే.. స్వామి వివేకానంద యూత్ ఐకాన్ ఎలా అయ్యారు?

ఇది చాలా ముఖ్యమైన అంశం.. పైగా నేటితరం యూత్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. అసలు స్వామి వివేకానంద యూత్ ఐకాన్ ఎలా అయ్యారో తెలుసా? తెలియకుంటే ఈ స్టోరీ పూర్తిగా చదివి తెలుసుకోండి..

ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన దేశ ప్రజలంతా యువజన దినోత్సవం (National Youth Day) జరుపుకుంటారు. అందుకు ప్రధాన కారణం స్వామి వివేకానంద. ఆయన జయంతి సందర్భంగా ఏటా ఈ ప్రోగ్రామ్  నిర్వహిస్తారు. అయితే.. యూత్ ఐకాన్‌ గా స్వామి వివేకానంద ఎందుకు మారారు? అసలు ఆయన ఏం చేశారు? ఆయన నుంచి యువత పొందే ప్రేరణ ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

స్వామి వివేకానంద 1863 జనవరి 12న పుట్టారు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అప్పట్లో బెంగాల్‌లో దైవ సమానులైన రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యుడిగా చేరారు. మిగతా శిష్యుల లెక్కనే అన్నీ నేర్చుకున్నారు. ఆ మాత్రం దానికే ఆయన యూత్ ఐకాన్ అవ్వలేదు. స్వామి వివేకానంద చదువుకునే రోజుల్లో కళ్లు మూసి పాఠం వినేవారు. కానీ, ఎప్పుడూ ఏ లెసన్ తిరిగి చెప్పమన్నా.. గడగడా చెప్పేసేవారు. అందుకనే ఆయన్ని ఏక సంతాగ్రహి అంటారు.

స్వామి వివేకానందకు ఏదైనా ఒకసారి వింటే ఇక అది మైండ్‌లో ఫిక్స్ అయిపోతుందన్నమాట. కళ్లు మూసుకున్నప్పుడు తనకు కాంతి లాంటిది కనిపిస్తుందని ఆయన చెప్పేవారు. స్వామి వివేకానంద చిన్నప్పుడు వాళ్ల ఇంటికి ఎవరైనా సాయం కోసం వస్తే ఆయన ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా.. రహస్యంగా ఇంటి కిటికీ లోంచీ విలువైన వస్తువులను బయటకు విసిరేసేవారు. దాంతో ఆ వస్తువుల్ని తీసుకుని చాలామంది పేదవాళ్లు అలా ఆర్థిక సాయం పొందేవాళ్లు.

అంతేకాకుండా రామకృష్ణ దగ్గర అన్ని బోధనలూ, భారతీయ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, యోగా వంటివి తెలుసుకున్న వివేకానంద.. వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్లి బోధించారు. అలా ఆయన భారత దేశపు గొప్పతనాన్ని విదేశీయులకు చాటిచెప్పారు. ఈ క్రమంలో ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. దాదాపు 6 నెలల పాటు రోజూ ఒక అరటిపండు మాత్రమే తిని సరిపెట్టుకున్నారు. ఇండియాలో హిందు మతంలో కీలక సంస్కరణలు, మార్పులకు స్వామి వివేకానంద శ్రీకారం చుట్టారు. భారతీయుల్లో ఐక్యతను పెంచారు. జాతీయతా భావాన్ని తట్టిలేపారు. ఆయన బోధనలు, సందేశాలు అప్పట్లో యువతను సన్మార్గంలో నడిపించాయి.

- Advertisement -


1893లో అమెరికా… చికాగోలోని ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చరిత్రాత్మక సందేశం ఇచ్చారు. అమెరికన్లు జనరల్‌గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగం మొదలుపెడతారు. కానీ, వివేకానంద… సోదర, సోదరీమణులారా (brothers and sisters) అంటూ ప్రసంగించి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచారు. అన్ని మతాల సారమూ ఒక్కటేనని చెప్పడం ద్వారా సర్వమత సమానత్వాన్ని చాటిచెప్పారు.  ఇలా అన్ని అంశాల సమాహారంగా స్వామి వివేకానందను యూత్ ఐకాన్ గా చెప్పుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement