భారత్ న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో రోజు కచ్చితంగా బౌలర్ల డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే టీమిండియా బ్యాట్స్‌మన్‌ను దెబ్బకొట్టిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఘనత మరువకముందే ఇండియా బౌలర్లు చెలరేగి ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టాపార్డర్‌లోని టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపగా.. ఆ తర్వాత మిచ్చెల్ను అక్షర్ పటేల్, హెన్నీ నిఖోలస్ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశారు.
కాగా.. 16 ఓవర్లలోనే 38 పరుగులకు 6 వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చెలరేగి ఆడుతున్న బౌలర్ల ధాటికి తట్టుకోలేక బ్యాట్స్‌మన్ చేతులెత్తేస్తూ వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈ రోజే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగుస్తుందా అన్న ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..