భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.కాగా బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. జనరల్ బిపిన్ రావత్ నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 8 డిసెంబర్ 2021న ఈ ప్రమాదం జరిగింది ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్గర్ కూనూర్ సమీపంలో క్రాష్ అయ్యింది. సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ లో సూలూరు నుండి వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌లో అతనితో పాటు భార్య మధులియా, 12 మంది ఇతర రక్షణ సిబ్బంది ఉన్నారు.
వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ఉపన్యాసం ఇచ్చేందుకు ఆయన వెళుతున్నారు. ఈ ప్రయాణంలో హెలికాప్టర్ గమ్యస్థానానికి 16 కిలోమీటర్ల దూరంలోనే కూలిపోయింది. ఈసారి మరణం అతన్ని గట్టిగా పట్టుకుంది. మృత్యువు ఆయనను ఓడించింది. అలా భారతదేశం తన మొదటి సీడీఎస్..అదేవిధంగా ఒక ధైర్య సైనిక అధికారిని కోల్పోయింది.కాగా మధులిక రావత్ సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు..ఈ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఇతర ఆర్మీ అధికారులను మరణించారు. దేశ రక్షణకే జీవితాన్ని అంకితం చేసిన మొదటి భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ మొదటి వర్ధంతి నేడు.. ఈ సందర్భంగా ఆయనకి వినమ్ర నివాళి అర్పిద్దాం.