Tuesday, November 26, 2024

స్థిరంగా బంగారం ధర.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. ఈ ఏడాది ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు 75 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచింది ఫెడ్. అయితే.. ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తుందని అనుకున్నా అలాంటిదేం ఉండదని ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ చెప్పారు. మన బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 5 రోజులుగా బంగారం ధర మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం విలువ 10 గ్రాములకు రూ.48,560 వద్దఉంది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.52,980 వద్ద ఉంది. ఇవాళ రేటు స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర తగ్గినా.. సిల్వర్ మాత్రం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.68,100కు చేరింది. అక్టోబర్‌ నెలలో వెండి గరిష్ట రేటు రూ.67 వేలు కాగా.. కనిష్టం అక్టోబర్ 15న రూ.60,500ను తాకింది. అంటే దాదాపు నెల రోజుల్లో వెండి రేటు ఏకంగా రూ.8 వేలు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement