Friday, November 22, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం రేటు 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.51,700కు చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి తులం రేటు హైదరాబాద్‌లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం రూ.56,510 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీ బులియన్ మార్కెట్లో కూడా రేట్లలో ఎలాంటి మార్పు లేదు. అక్కడ 22 క్యారెట్ల బంగారం తులానికి రూ. 51 వేల 950 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.56 వేల 610 వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తూ భారీగా దిగివస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర తాజాగా రూ.600 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.70 వేల 900 మార్కుకు పడిపోయింది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో వెండి ధర ప్రస్తుతం కిలోకు రూ.500 మేర పడిపోయి రూ.68,300 మార్కు వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోల్చి చూస్తే దిల్లీలో వెండి చాలా తక్కువకే లభిస్తుంది. బంగారం ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement