Monday, September 16, 2024

స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. పెరిగిన వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. తాజాగా గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ.100 మేర పడిపోయింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 54,330 వద్ద ఉంది. బంగారంతో పోలిస్తే వెండి రేటు మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో తాజాగా కిలో వెండి రూ. 200 మేర పెరిగి ప్రస్తుతం రూ.73 వేల మార్కుకు ఎగసింది. 10 రోజుల్లో దాదాపు రూ.2000 వరకు ఎగబాకడం గమనార్హం.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో రేటును పెంచింది. గతంలో వరుసగా 50 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచగా ఈసారి మాత్రం దానిని కాస్త తగ్గించింది. 35 బేసిస్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ ఒక్క ఏడాదే ఏకంగా 2.25 శాతం మేర రెపో రేటును పెంచడం గమనార్హం. దీంతో వడ్డీ రేటు 6.25 శాతానికి పెరిగింది. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం జరగనుంది. మరోసారి అప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement