Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం పట్టాయి.పసిడి రేటు తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 210 మేర దిగివచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. పది గ్రాములకు రూ. 200 తగ్గింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 47,150కు క్షీణించింది. ఇక వెండి రేటు రూ. 600 దిగి వచ్చింది. కేజీ వెండి రేటు రూ. 63 వేలకు తగ్గింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. కాగా బంగారం ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం.

గోల్డ్ రేటు గత కొంత కాలంగా పడిపోతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గింది. అయితే పతనం తర్వాత పసిడి రేటు ఒక స్థాయి వల్ల మద్దతు తీసుకుంది. మళ్లీ అక్కడి నుంచి పైపైకి కదిలింది. అయితే ఈ క్రమంలో పసిడి రేటు నిరోధాన్ని అధిగమించ లేకపోయింది. బంగారానికి 1794 డాలర్ల వద్ద, అలాగే 1800 డాలర్ల వద్ద నిరోధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే 1761 డాలర్లు, 1750 డాలర్ల వద్ద మద్దతు లభించొచ్చని తెలియజేస్తున్నారు. ఒకవేళ పసిడి రేటు ఈ స్థాయిని కూడా కోల్పోతే అప్పుడు 1686 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement