నేటి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. కేసారి రూ.400పెరిగింది.కాగా జూన్ 17న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పైపైకి కదిలింది. రూ. 430 పెరుగుదలతో రూ. 51,870కు ఎగసింది. 10 గ్రాముల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగింది. పది గ్రాములకు రూ. 400 పెరిగింది. రూ. 47,550కు చేరింది. వెండి మాత్రం నిలకడగానే కొనసాగింది. సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. కేజీకి రూ. 66 వేల వద్దనే ఉంది. వెండి ధర స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి రేటు పడిపోయింది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.07 శాతం క్షీణించింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1848 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.54 శాతం దిగివచ్చింది. దీంతో సిల్వర్ రేటు 21.77 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తగ్గినా దేశీ మార్కె్ట్లో గోల్డ్ పైకి చేరడం గమనార్హం
Advertisement
తాజా వార్తలు
Advertisement