Friday, November 22, 2024

నేటి బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏకంగా రూ.2000 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్లో రూ.200 పెరిగింది. దీంతో రూ.47 వేల 800 నుంచి ధర రూ.48 వేలకు చేరింది. ఇక అదే 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు రూ. 210 పెరిగి.. రూ.52 వేల 360కి చేరింది.వెండి విషయానికి వస్తే భారీగా పెరుగుతోంది. వారం -10 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఏకంగా ఈ సమయంలో రూ.2600కుపైనే పెరిగింది.

నవంబర్ 7న కిలో వెండి రేటు రూ.66 వేల 300 వద్ద ఉండగా. ఇప్పుడది రూ.68 వేల 500కు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రేటు ఇక్కడ రూ.68 వేల 500 వద్ద ఉంది. అయితే బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, స్థానిక పన్ను రేట్లను బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ వంటి ఆభరణాలకు మరింత డిమాండ్ ఉంటుంది. దీంతో రేట్లు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అందుబాటు, సరసమైన ధరల్లో లభించినప్పుడు కొనుగోలు చేయడం మంచిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement