నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. మన బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రూ.300 పెరిగి రూ.46, 850 పలుకుతోంది. అంతకుముందు రోజు ఇది రూ.46,550 వద్ద ఉండేది. ఇక 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.330 పెరిగి రూ.50 వేల 780 నుంచి రూ.51,110కి పెరిగింది. సిల్వర్ విషయానికి వస్తే భారీగా తగ్గింది. అంతకుముందు రోజు రూ.2000 పెరిగిన రేటు మళ్లీ మరుసటి రోజే తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.500 మేర పెరిగి మళ్లీ రూ.64 వేల 500కు చేరింది. అంతర్జాతీయంగా ధరలు పతనం అవుతుండటంతో రేట్లు దేశీయంగానూ మరింత తగ్గే అవకాశాలున్నాయి. కనిష్ట స్థాయిలకు చేరనున్నట్లు తెలుస్తోంది. పండగ సీజన్ తర్వాత కూడా ధరలు తగ్గుతుండటం వల్ల.. కొనేందుకు జనం ఎగబడతారని, ఇప్పటికే గోల్డ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ కొవిడ్ ముందటి స్థాయిలకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి చెప్పిన విషయం తెలిసిందే. భారత్లోనే ఇది భారీగానే పెరిగిందని, గోల్డ్ రిజర్వ్స్ కూడా పెరిగాయని చెప్పింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement