నేడు బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 మేర తగ్గి.. రూ.49 వేల 800కు చేరింది. గత 10 రోజులుగా చూస్తే రేటు తగ్గడం ఇది రెండోసారి మాత్రమే. వరుసగా పెరుగుకుంటూనే పోయాయి. ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర రేటు హైదరాబాద్‌లో రూ.110 తగ్గి.. రూ.54,330కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే ఇది ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి పెరిగింది. ఏకంగా రూ. 73 వేల వద్ద ట్రేడయింది. ప్రస్తుతం రూ.200 తగ్గి.. రూ.72,800కు చేరింది. దిల్లీలో మాత్రం వరుసగా పెరుగుతూనే ఉంది.
ఏకంగా రూ.900 పెరిగి.. 69 వేల రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1784 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర 23.48 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ.82.54 వద్ద ఉంది.గత కొద్దిరోజుల కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. 35 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. రెపో రేటు ఈ ఒక్క ఏడాదే 2.25 శాతం పెరిగింది. దీంతో మొత్తం రెపో రేటు 6.25 శాతానికి చేరింది.