నేడు బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఎట్టకేలకు 5 రోజుల తర్వాత పసిడి రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యకాలంలోనూ తులంపై సుమారు రూ.340 వరకు రేటు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.100 తగ్గి.. 48 వేల 460 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు కూడా 100 తగ్గి.. రూ.52,880కి పడిపోయింది.బంగారం తగ్గినప్పటికీ సిల్వర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.68,100 వద్ద ఉంది. అంతకుముందు రోజు కిలో వెండిపై రూ.600 మేర రేటు పెరిగింది. రానున్న రోజుల్లో రేట్లు మరింత పతనం అవనున్న నేపథ్యంలో.. గోల్డ్, సిల్వర్ కొనేందుకు ఇంకొన్ని రోజులు ఎదురుచూస్తే మంచిదని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement