Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. గ‌త మూడురోజులుగా బంగారం ధ‌ర పెరుగుతూ ఉండ‌గా పుత్త‌డి బాటలోనే వెండి కూడా పయనించింది. ఆగస్ట్ 27న హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 160 పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ పెంపు వర్తిస్తుంది. దీంతో ఈ బంగారం ధర రూ. 51,980కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు అయితే పది గ్రాములకు రూ. 150 పైకి కదిలింది. దీంతో పసిడి రేటు రూ. 47,650 వద్ద ఉంది. బంగారం ధర మూడు రోజుల్లో రూ. 750 మేర పరుగులు పెట్టింది. వెండి రేటు గమనిస్తే.. రూ. 200 పెరిగింది. కేజీ సిల్వర్ రేటు ఇప్పుడు రూ. 61,300 వద్ద కొనసాగుతోంది. వెండి రేటు మూడు రోజుల్లో చూస్తే.. రూ. 600 మేర పైకి చేరింది. దేశీ మార్కెట్‌లో బంగారం జోరు కొనసాగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. గోల్డ్ రేటు ఔన్స్‌కు 1.16 శాతం మేర పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1750 డాలర్లకు దిగి వచ్చింది. అలాగే సిల్వర్ రేటు కూడా ఇంతే. వెండి ధర కూడా పతనమైంది. 1.8 శాతం దిగి వచ్చింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 18.77 డాలర్లకు క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement