నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు శనివారం దేశీయ మార్కెట్ల దిగివచ్చి పసిడి ప్రియులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.56 వేల 550 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర హైదరాబాద్‌లో తులానికి రూ.440 పడిపోయి రూ.61 వేల 690 మార్క్ వద్ద ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.450 తగ్గింది. ప్రస్తుతం రూ.56 వేల 650 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.440 దిగివచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో తులం రేటు రూ.61 వేల 840 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రేటు (Silver Prices) ఇవాళ రూ.3300 పడిపోయింది. రెండ్రోజుల్లోనే రూ.4000 దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం కిలో వెండి రేటు భాగ్యనగరంలో రూ. 78 వేల 700 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ రూ.2600 పడిపోయింది. రెండ్రోజుల్లో మొత్తం రూ.3000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.75 వేలు పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. వెండి రేటు మాత్రం హైదరాబాద్‌లో కాస్త ఎక్కువ ఉంటుంది. ధరల వ్యత్యాసానికి ప్రధానంగా స్థానికంగా ఉండే పన్నులు కారణమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 2011 డాలర్లు పలుకుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 23.98 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ దిగజారింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూ.82.245 మార్క్ వద్ద ట్రేడవుతోంది.