Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంత‌ర్జాతీయంగా బంగారం.. వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి.కాగా భారత్‌లో ఏయే ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు మళ్లీ 2015 డాలర్లకు ఎగబాకింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా 25.30 డాలర్ల మార్కుపైకి చేరింది. ఇక డాలర్‌తో చూస్తే గనుక రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.778 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ.. దేశీయంగా మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు 22 క్యారెట్లకు రూ.55,700 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. దిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు అక్కడ రూ.55,850 మార్కు వద్ద ట్రేడవుతుండగా.. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 60,910 మార్కు వద్ద కదలాడుతోంది.ఇక సిల్వర్ రేట్ల విషయానికి వస్తే గనుక తాజాగా రూ.100 మేర పెరిగి కిలోకు దిల్లీలో రూ.76,100 మార్కు వద్ద ఉంది. ఇటీవల అక్కడ వరుసగా రేట్లు పడిపోవడం చూసే ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర తాజాగా పెరిగింది. ఒక్కరోజే రూ.300 మేర ఎగబాకగా.. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.80,500 మార్కు వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement