Tuesday, November 26, 2024

మూడోరోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. స్థిరంగా వెండి

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా మూడో రోజు దిగివచ్చింది. ఇవాళ 10 గ్రాములకు రూ.70 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 650 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములకు రూ.80 తగ్గింది. ప్రస్తుతం తులానికి రూ.60 వేల 710 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.55 వేల 750 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 మేర దిగివచ్చి ప్రస్తుతం రూ.60 వేల 860 మార్క్ వద్ద ఉంది.

వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తూ దిగివస్తోంది. ఇటీవల కిలో వెండి రేటు రూ.81 వేలు దాటిన విషయం తెలిసిందే. అయితే గడిచిన మూడు రోజుల్లో కిలోపై రూ.1300 మేర తగ్గడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.400 తగ్గి రూ.80 వేల పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.500 మేర తగ్గి ప్రస్తుతం రూ.76 వేల 400 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. ట్యాక్సుల కారణంగా ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే బంగారం, వెండి రేట్లు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1999 డాలర్లు పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement