నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.390 మేర తగ్గింది. ప్రస్తుతం తులం గోల్డ్ రూ.55 వేల 400 లకు దిగివచ్చింది. గత నాలుగు రోజులుగా చూసుకుంటే మొత్తంగా తులానికి రూ.850 మేర పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఇవాళ రూ.430 మేర దిగివచ్చింది. ప్రస్తుతం రూ.60 వేల 430 వద్ద కొనసాగుతోంది. ఇది సైతం నాలుగు రోజుల్లో తులానికి రూ.930 మేర పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.390 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 550 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ.430 తగ్గింది. ప్రస్తుతం రూ.60 వేల 580 వద్ద కొనసాగుతోంది.వెండి విషయానికి వస్తే గరిష్ఠాల్లోనే కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కాస్త దిగివచ్చి ఊరట కలిగించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు (Silver Price) రూ.200 తగ్గి రూ.80 వేల మార్క్ పై ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ. 76 వేల 300 వద్ద ఉంది. హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువ, బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement