Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్లకు రూ. 100 మేర పడిపోయింది. దీంతో 52 వేల రూపాయలకు చేరింది. ఇక గత 10 రోజుల వ్యవధిలో ఒక్కరోజు మాత్రమే రేటు పెరగడం గమనార్హం. మిగతా దాదాపు అన్ని రోజుల్లో పతనమైంది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.100 పతనమై రూ. 56, 730 వద్ద కొనసాగుతోంది. దిల్లీలో కూడా గోల్డ్ రేటు పతనం కొనసాగుతోంది. దేశ రాజధానిలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.100 పడిపోయి రూ.52,150కి అమ్ముడుపోతోంది. 24 క్యారెట్ గోల్డ్ అక్కడ 10 గ్రాములకు రూ.120 తగ్గి ప్రస్తుతం రూ.56,880కి చేరింది. బంగారం ధర తగ్గిన సమయంలోనే వెండి రేట్లు కూడా పడిపోతున్నాయి. దిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 68,500 వద్ద ఉంది. గత 10 రోజుల్లో కేవలం ఒకే రోజు రేటు పెరిగింది. మిగతా రోజుల్లో నేలచూపులే చూసింది. ఇక ఈ 10 రోజుల్లో కిలోకు రూ.2 వేల వరకు పడింది సిల్వర్. హైదరాబాద్‌లో కూడా వెండి రేటు పతనమైంది. గడచిన 10 రోజుల వ్యవధిలో ఇక్కడ రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు స్థిరంగా రూ.71,700 మార్కు వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement