Sunday, November 17, 2024

Today : బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు ఒక్కరోజే పెద్ద మొత్తంలో కుప్పకూలిపోయింది. ఈ గోల్డ్ తాజాగా రూ.350 పడిపోగా.. 10 గ్రాములకు ఇప్పుడు రూ.55,050 మార్కుకు చేరింది. మరోవైపు 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.400 పతనం కాగా.. రూ.60,050 మార్కు వద్ద కదలాడుతోంది. దిల్లీలో కూడా ఇదే రీతిలో బంగారం ధర పడిపోయింది. 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 350 పడిపోయి రూ. 55,200 మార్కుకు చేరగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,200 మార్కు వద్ద ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగానే పడిపోయాయి. దిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.100 పడిపోయి రూ. 74 వేల మార్కుకు చేరగా.. హైదరాబాద్‌లో మాత్రం వెండి భారీగా దిగొచ్చింది. తాజాగా ఒక్కరోజులోనే రూ.700 పడిపోయి కిలో వెండి రేటు రూ.78,500 వద్ద ఉంది. ఇక బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాలను బట్టి.. అక్కడి పన్నులను బట్టి మారుతుంటాయి.ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1936 డాలర్లకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు విషయానికి వస్తే 23.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోల్చి చూస్తే గనుక రూపాయి మారకం విలువ రూ. 81.99కి పుంజుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement