నేటి బంగారంద..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 వద్ద స్థిరంగా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.60,450 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు మాత్రం బంగారం ధర 10 గ్రాములకు రూ.100 చొప్పున పతనమైంది. దేశ రాజధాని దిల్లీలో బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.55,550 వద్ద స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా ఉన్న సమయంలో సిల్వర్ రేటు పడిపోయింది. దిల్లీలో కిలో వెండి రేటు రూ.200 పడిపోగా.. రూ.74,100 వద్ద ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.100 తగ్గి రూ. 79,200 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి.. వీటిల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు.. బంగారం, వెండి ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ పుంజుకొని బంగారం ధర పడిపోతుంటుంది. అదే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే గనుక బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారి.. దీని విలువ పెరుగుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement