Friday, November 8, 2024

Bullion Market : బంగారం.. వెండి ధరలు ఎంతంటే…

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు చూస్తే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 600 పలుకుతోంది. ఇక స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.460 పెరిగి ప్రస్తుతం రూ.60 వేల 680 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.55 వేల 750 పలుకుతోంది.

ఇక 24 క్యారెట్ల్ మేలిమి గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.460 పెరిగి రూ.60 వేల 830 వద్దకు చేరుకుంది. వెండి విషయానికి వస్తే ఇవాళ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. కిలో వెండి రేటు ఒక్కరోజులో రూ.2000 పెరిగింది. మన హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఇవాళ రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.79 వేల 700 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి రేటు కిలోపై రూ.1100 పెరిగి ప్రస్తుతం రూ.74 వేల 500 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, బంగారం ధర మాత్రం కాస్త తక్కువగానే లభిస్తుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తాయన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement