Wednesday, November 20, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. కాగా హైదరాబాద్‌లో పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 46,500గా ఉంది. ఇది క్రితం రోజు 46,650 వద్ద ఉంది. అంటే రూ. 150 మేర తగ్గింది. 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 170 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు చెందిన తులం పుత్తడి ధర రూ.50,730 వద్ద ట్రేడవుతోంది. అయితే గోల్డ్ ధరలు తగ్గినా సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 62,000 పలుకుతోంది. 10 రోజుల వ్యవధిలో సిల్వర్ ఏకంగా రూ.1000 తగ్గడం గమనార్హం. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.46 వేలుగా ఉండగా..

ఇప్పుడు అంటే 10 రోజుల వ్యవధిలో 500 మేర పెరిగింది. ఇప్పుడు మళ్లీ పండగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు కాస్త పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పసిడిపై పెట్టుబడులు పెట్టేవారికి ఇది శుభవార్తేనని అంటున్నారు. అయితే.. అంతర్జాతీయంగా మాంద్యం భయాలతో బంగారం డిమాండ్ తగ్గిందని పేర్కొంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగతోందని వివరించారు. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన.. 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 46,650 వద్ద ఉంది. అదే 24 క్యారెట్ల పుత్తడి రూ. 50,890 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర కాస్త తగ్గి ఔన్సుకు 1660.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ కాస్త పుంజుకొని.. ఔన్సు 19.03 డాలర్ల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement