నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేల 600 వద్ద కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ ఈ విలువ ఎక్కువే. గత ఏడాది నవంబర్‌లో బంగారం ధర కనిష్ఠంగా రూ.46,100గా నమోదైంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 57 వేల 380 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశ రాజధాని దిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల తులం బంగారం రూ.52, 750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57 వేల 530 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే.. బంగారంతో పాటే ఇదీ పెరుగతూ వస్తోంది. గత ఏడాది నవంబర్‌లో కిలో వెండి రూ.64 వేల వద్ద ఉండగా.. రెండున్నర నెలల్లో దాదాపు రూ.8 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72 వేల 700 వద్ద కొనసాగుతోంది. అయితే.. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధానిలో బంగారం ధరలకు రాస్త తక్కువగానే ఉన్నాయి. గత మూడు సెషన్లలో సుమారు రూ.900 వరకు తగ్గిన వెండి.. ఇవాళ్ల స్థిరంగా ఉంది. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి ధర రూ.70 వేల 500 వద్ద కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement