నేటి బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర తులానికి రూ.100 మేర పెరగ్గా.. ప్రస్తుతం రూ.52,750 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ. 250 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.110 మేర ఎగబాకగా.. రూ.57,550 మార్కును తాకింది. దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 మేర పెరిగి రూ.52,900 వద్ద ఉండగా.. ఇదే 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే రూ.110 మేర ఎగబాకి.. ప్రస్తుతం రూ.57,700 మార్కును చేరింది. మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో కేజీ సిల్వర్ రూ.100 పెరిగి రూ.71,300 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు స్థిరంగా రూ.74 వేల వద్ద ఉంది. అయితే ఇది 4 రోజుల వ్యవధిలో రూ.3800 పడిపోయింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉండగా.. వెండి రేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement