Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.250 మేర పెరిగింది. దీంతో రూ.52,650కి చేరింది. అంతకుముందు 2 రోజుల్లో రూ.1200 మేర పడిపోయింది. ఇక జనవరి నెల కనిష్టంతో చూస్తే బంగారం ధర ఏకంగా రూ.2200 మేర ఎగబాకింది. సరిగ్గా జనవరి 2న గోల్డ్ రేటు రూ.50,450 వద్ద ఉండేది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.280 పుంజుకొని రూ.57,440కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.250 పెరగ్గా.. ప్రస్తుతం రూ.52,800కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇక్కడ 10 గ్రామలకు రూ.280 మేర వృద్ధి చెంది రూ.57,590 పలుకుతోంది.మరోవైపు వెండి ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 2 రోజుల వ్యవధిలో రూ.3600 పడిపోగా.. దిల్లీలో రూ.3500 తగ్గింది. ఇవాళ మళ్లీ ఈ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి రేటు కిలోకు ప్రస్తుతం రూ.200 తగ్గగా.. రూ.74 వేల వద్ద ఉంది. ఇక దిల్లీలో మాత్రం రేటు స్థిరంగా రూ.71,200 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement