నేటి బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..హైదరాబాద్‌లో తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.52,650 వద్ద ట్రేడవుతోంది. జనవరి 29,30 తేదీల్లో రేట్లలో ఏం ఛేంజ్ కనిపించలేదు. ఇక ఇదే 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.57,440 వద్ద కొనసాగుతోంది. దేశరాజధాని దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.52,800 మార్కు వద్ద ఉండగా.. ఇక 24 క్యారెట్ల బంగారం మాత్రం 10 గ్రాములకు రూ.57,590 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరల్లో మాత్రం మార్పు కనిపించింది. తాజాగా రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఒక్కరోజే రూ.500 మేర ఎగబాకగా.. రూ.74,700కు చేరింది. దిల్లీలో కేజీ సిల్వర్ రూ.200 మేర పెరిగి ప్రస్తుతం రూ.72,400 వద్ద కొనసాగుతోంది. అయితే దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఇక వెండి రేటు మాత్రం ఢిల్లీలో చాలా తక్కువకు లభిస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement