నేడు బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,950 వద్ద విక్రయం అవుతోంది. అంతకుముందు వరుసగా 2 రోజుల్లో రూ.600 మేర పడిపోవడం గమనార్హం. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.270 పెరిగి రూ.54,490 వద్ద కొనసాగుతోంది.ఢిల్లీలో తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ.250 పెరిగి రూ. 50,100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.260 ఎగబాకి.. ప్రస్తుతం రూ.54,640 వద్ద ఉంది.
హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అక్కడ పన్ను విధానం వేరేలా ఉంటుంది.వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 మేర పెరిగి రేటు రూ.73 వేల మార్కుకు చేరింది. 2 రోజుల్లో రూ.1500 తగ్గింది. డిసెంబర్ 14న సిల్వర్ రేటు రూ.74 వేల వద్ద ఉండటం విశేషం. ఢిల్లీలో తాజాగా రూ.500 తగ్గి కిలోకు రూ.69000 పలుకుతోంది. ఈ లెక్కన వరుసగా 3 రోజుల్లో కలిపి రూ.2 వేలు తగ్గింది. అంతకుముందు వారంలోనే రూ.5,500 పెరగడం గమనార్హం.