Saturday, November 23, 2024

నేటి బంగారం..వెండి ధరలు ఇవే

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. భారత్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. వారం రోజుల్లో 5 రోజులు తగ్గిన తర్వాత గోల్డ్ రేట్లు మళ్లీ పెరగడం గమనార్హం. ఇన్ని రోజుల్లో రూ.500 మేర తగ్గగా.. తాజాగా ఒక్కరోజే రూ.300 పెరగడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48 వేల 550 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.530 మేర పెరిగి 52 వేల 970 రూపాయలకు చేరింది. సిల్వర్ మాత్రం వరుసగా పెరుగుకుంటూ పోతూనే ఉంది. ప్రస్తుతం రూ.700 పెరిగి.. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.68,200 పలుకుతోంది. వరుసగా 3 రోజుల వ్యవధిలో సిల్వర్ ధర రూ.1700 మేర పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం పరిస్థితులు క్రమక్రమంగా వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు చైనాలో కొవిడ్ మళ్లీ భయానకంగా తయారైంది. దీంతో మళ్లీ డాలర్‌కు గడ్డుకాలం ఎదురుకానుందని, ఇది గోల్డ్‌కు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక అప్పుడు బంగారం, వెండి రేట్లు అందనంత ఎత్తుకు చేరుతాయట.

Advertisement

తాజా వార్తలు

Advertisement