Sunday, November 17, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర 10 గ్రాములకు రూ.400 పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 200 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.430 తగ్గి ప్రస్తుతం రూ.60 వేల 220 వద్దకు చేరింది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల్ బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 55 వేల 350 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.430 పడిపోయి ప్రస్తుతం రూ.60 వేల 370 వద్దకు దిగివచ్చింది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తోంది. వెండి రేటు వరుసగా పడిపోతోంది.

ఇవాళ కిలో వెండి రేటు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో రూ.100 తగ్గి రూ.73 వేల 400లకు చేరింది. మరోవైపు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ రూ.100 తగ్గింది. రెండ్రోజుల్లో రూ.300 దిగివచ్చింది. ప్రస్తుతం కిలో రేటు రూ. 77 వేల 700 పలుకుతోంది. ఢిల్లీ ధరలతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది. బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే వెండి రేటు మాత్రం హైదరాబాద్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు అందుకు కారణంగా మారతాయి.అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1964 డాలర్ల వద్దకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఇవాళ ఔన్సుకు 24.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోల్చినప్పుడు రూ.82.518 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement