Tuesday, November 26, 2024

నేటి బంగారం. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధరలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.55 వేల 550 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా తులానికి రూ.60 వేల 600 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే ఇవాళ తులం బంగారం రేటు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.55 వేల 700 పలుకుతోంది. క్రితం సెషన్‌లో ఇది రూ.50 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ఢిల్లీలో 10 గ్రాములకు రూ.60 వేల 750 మార్క్ వద్ద ట్రేడవుతోంది.వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తోంది. సిల్వర్ ధరల్లోనూ ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి రేటు దేశ రాజధాని హస్తినాలో రూ.73 వేలు పలుకుతోంది. ఇక హైదరాబాద్ మహా నగరంలో కిలో వెండి ధర ఇవాళ రూ.77 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే మన హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారం ధర మాత్రం తక్కువకే లభిస్తుంది. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు, ఇతర అంశాలు కారణంగా మారతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement