నేటి బంగారం.. వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా పడిపోయి.. కొనేవారికి కాస్త ఊరట కల్పించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు ప్రస్తుతం రూ200 పడిపోగా.. రూ.55,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.60,820 వద్ద ట్రేడవుతోంది. ఇక దిల్లీ మార్కెట్‌లో చూస్తే 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు రూ. 200 పడిపోయి రూ.55,900 వద్ద ఉండగా.. ఇదే 24 క్యారెట్ల విషయానికి వస్తే రూ.220 పతనమై.. రూ.60,970 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర పడిపోయిన క్రమంలోనే వెండి రేట్లు కూడా పతనమయ్యాయి. దిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.300 పడిపోగా.. ప్రస్తుతం రూ.76,200 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.200 పతనం కాగా.. సరిగ్గా రూ.80 వేల మార్కు వద్ద ఉంది. ఇక మనం చూసినట్లయితే దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి రేట్ల విషయానికి వస్తే దిల్లీతో చాలా తక్కువ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు అనేవి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఆధారపడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement