Friday, November 22, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.200 పెరగ్గా.. ప్రస్తుతం రూ.56,050 మార్కును తాకింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.220 ఎగబాకి రూ.61,150 మార్కుకు చేరింది. ఇదే సమయంలో దిల్లీ బులియన్ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అక్కడ 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.200 పెరిగి రూ.56,200 మార్కును చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరగ్గా రూ.61,280 మార్కు వద్ద ఉంది. వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో కిలోకు తాజాగా రూ.300 పెరగ్గా.. రూ.81,300 మార్కు వద్ద ఉంది.

ఇక దిల్లీలో సిల్వర్ రేటు చూస్తే తాజాగా రూ.200 ఎగబాకి.. రూ.77,600 వద్ద కొనసాగుతోంది. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు మనం గమనించొచ్చు. సాధారణంగా హైదరాబాద్‌లో బంగారం ధర.. దిల్లీతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి రేటు ఎక్కువగ ఉంటుంది. దీనికి కారణం పన్నుల్లో వ్యత్యాసాలే అని చెప్పొచ్చు. ఇక తదుపరి బంగారం, వెండి ధరల గమనాన్ని నిర్దేశించేంది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలేనని చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధర తగ్గడం గమనార్హం. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1980 డాలర్లకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 25 డాలర్లకు దిగొచ్చింది. ఇదే సమయంలో డాలర్‌తే పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.090 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement