Friday, November 22, 2024

త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. మన బులియన్ మార్కెట్లో ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుకుంటూ పోయిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గాయి. నవంబర్ 19న హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.48 వేల 600 మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 160 పతనమై రూ.53,020 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ.500 పెరిగింది. అంతకుముందు రెండు రోజుల్లో రూ.1500 మేర తగ్గడం గమనార్హం. అయితే ఇవి తగ్గినట్లు కనిపించినా గరిష్ట విలువల వద్దే ఉన్నాయి. అంతకుముందు చాలా ఆకర్షణీయ ధరలకు చేరాయి. పండగ సీజన్‌లో తక్కువ ధరలు, మంచి డిమాండ్‌తో భారీగా విక్రయాలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌కు తోడు రేట్లు అందనంత ఎత్తులో ఉన్నాయి. బంగారం కొనే ముందు చూసి కొనండి. హాల్ మార్క్ ఉంటేనే స్వచ్ఛమైన బంగారంగా పరిగణించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement