Saturday, November 23, 2024

త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..ఢిల్లీతో పోలిస్తే బంగారం ధర మాత్రం హైదరాబాద్‌లో కాస్త తక్కువగానే ఉంది.దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంది. స్థానిక పన్నులు, పరిస్థితులు దీనికి కారణం. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.70 తగ్గి ప్రస్తుతం రూ.50 వేల 80 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర కూడా 5 రోజులుగా అస్సలు తగ్గలేదు. ఇక 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు రూ.80 పతనమై.. రూ.54,630 వద్దకు చేరింది. దిల్లీలో బంగారం ధర కూడా 5 రోజుల తర్వాత తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.100 మేర పతనమైంది.

దీంతో ఇప్పుడు అక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.50,200కు పడిపోయింది. ఇదే 24 క్యారెట్ల విషయానికి వస్తే రూ.110 మేర తగ్గి రూ.54,750 కు చేరింది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. మళ్లీ గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సకు 1818 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24 డాలర్ల మార్కుపైకి చేరింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతూనే ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ.82.835 వద్ద ఉంది. ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అయినా గోల్డ్, సిల్వర్ రేట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక కరోనా భయాలు, ఆర్థిక మాంద్యం సంకేతాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement