Monday, November 18, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ సహా హైదరాబాద్, దిల్లీ వంటి చోట్ల గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1876.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ 20.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక చివరగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ.82.060 వద్ద ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.10 పెరిగి రూ.52,160 వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,890 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.దిల్లీలో కూడా గోల్డ్ రేట్లు రూ.10 చొప్పున పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ.10 పెరిగి రూ.52,310 వద్ద ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు రూ.10 పెరిగి రూ.57,050 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా పెరిగిన తరుణంలో సిల్వర్ రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దిల్లీలో కిలో వెండి రేటు రూ.65,700 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ స్థిరంగా రూ.68,700 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement