నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నేడు గోల్డ్ రేఉ భారీగా పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. రేట్లు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్, సిల్వర్ కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో జూలై 29న బంగారం రేటు ఎలా ఉందో తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 700 పెరిగింది. దీంతో 10 గ్రాములకు ఈ పసిడి రేటు రూ. 51,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 650 మేర పెరిగింది. రూ. 47,100కు పరుగులు పెట్టింది.
వెండి ధరను గమనిస్తే.. సిల్వర్ రేటు రూ. 1200 మేర ర్యాలీ చేసింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 61,200కు చేరింది. కాగా ఈ రేట్లకు జీఎస్‌టీ, ఇరత చార్జీలు అదనం.అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 0.19 శాతం మేర పైకి చేరింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1753 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ రేటు చూస్తే.. దీని ధర 0.55 శాతం మేర పెరిగింది. ఔన్స్‌కు సిల్వర్ రేటు 19.97 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఇటీవల బంగారం ధరలు 1700 డాలర్ల కిందకు పడిపోయిన విషయం తెలిసిందే.