నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 2న బంగారం ధర రూ. 110 మేర తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 51,380కు క్షీణించింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 తగ్గుదలతో రూ. 47,100కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర రూ. 400 పడిపోయింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 63,300కు దిగి వచ్చింది. దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర ఈరోజు పైకి చేరింది. వెండి మాత్రం పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 1795 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గింది. 20.36 డాలర్లకు దిగి వచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement