నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు తాజాగా రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.56,750కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ఒక్కరోజే రూ. 110 పెరిగి రూ.61,910 వద్ద ఉంది. మరోవైపు దిల్లీ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేటు ఒక్కరోజే రూ.100 పెరిగింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు దేశ రాజధానిలో రూ.56,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.110 పెరిగి రూ.62,060 వద్ద ఉంది. మరోవైపు వెండి రేట్ల విషయానికి వస్తే దిల్లీ మార్కెట్‌లో ఒక్కరోజే కిలోకు రూ.300 పెరిగి ఇప్పుడు రూ.75,100కు చేరింది. అదే హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రేటు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.78,800 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే హైదరాబాద్‌లో బంగారం ధర .. దిల్లీతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. అదే దిల్లీలో వెండి రేటు మాత్రం హైదరాబాద్‌తో చూస్తే సుమారు రూ.3 నుంచి 4 వేల వరకు తేడా ఉంటుంది. దిల్లీలోనే వెండి రేటు తక్కువగా లభిస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement