Friday, November 22, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ కాస్త దిగివచ్చింది. క్రితం సెషన్‌లో పెరిగిన గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.55 వేల 500కు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.130 పడిపోయి రూ.60 వేల 550 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 650 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఢిల్లీలో రూ.130 తగ్గి రూ.60 వేల 700 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే ఇవాళ మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో క్రితం రోజునే ఒక్కసారిగా కిలో రేటు రూ.2000 పెరిగిన విషయం తెలిసిందే.

అదే కొనసాగిస్తూ ఇవాళ మరో రూ.100 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.79 వేల 800 మార్క్ వద్దకు చేరింది. దేశ రాజధానిలో చూసుకుంటే కిలో వెండి రేటు క్రితం రోజు రూ.1100 పెరగగా ఇవాళ మాత్రం స్థిరంగా రూ.74 వేల 500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య బంగారం, వెండి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా లభిస్తుండగా.. వెండి మాత్రం ఢిల్లీ కన్నా భారీగా రేటు ఎక్కువ ఉంటుంది.అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ స్థిరంగా ఉన్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1961 డాలర్లు పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూ.82.453 వద్ద అమ్ముడ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement