Saturday, November 23, 2024

పెరిగిన బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోయాయి. హైదరాబాద్‌ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేటు 22 క్యారెట్ల 10 గాములకు తాజాగా రూ.200 మేర పెరిగి రూ.56,050 వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.230 పెరిగి.. రూ.61,150 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు వరుసగా 4 రోజులు గోల్డ్ రేటు తగ్గిన సంగతి తెలిసిందే.దిల్లీ బులియన్ మార్కెట్లోనూ గోల్డ్ రేటు ఇవాళ పెరిగిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు దేశ రాజధానిలో ఒక్కరోజే రూ. 200 పుంజుకోగా ప్రస్తుతం రూ.56,200 మార్కు వద్ద ఉంది.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు చూస్తే ఒక్కరోజే రూ.240 పెరగ్గా.. రూ.61,310 మార్కు వద్ద ఉంది.మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు తాజాగా రూ.500 పెరగ్గా.. ప్రస్తుతం 81 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక దిల్లీలో కిలో వెండి రూ.200 ఎగబాకి.. ప్రస్తుతం రూ.77600 మార్కు వద్ద ఉంది. సాధారణంగా దిల్లీ, హైదరాబాద్ మార్కెట్లే కాకుండా.. ఎక్కడైనా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు దిల్లీతో చూస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా, వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ఈ హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement