నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో చూసినట్లయితే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.800 మేర పెరగ్గా రూ.56,500 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.880 మేర పుంజుకొని.. రూ.61,640 కు చేరింది. ఈ మధ్య కాలంలో ఒక్కరోజులో రేటు ఇంత మేర పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు దిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా పెరిగింది. అక్కడ ఒక్కరోజులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 800 చొప్పున పెరగ్గా రూ.56,650 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే రూ.880 మేర పుంజుకొని.. రూ.61,790 వద్ద ఉంది.బంగారం ధరతో పాటే వెండి రేటు కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. తాజాగా కిలో వెండి రేటు దిల్లీలో రూ.700 పెరగ్గా ప్రస్తుతం రూ.76,800 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే హైదరాబాద్ మార్కెట్‌లో చూస్తే ఒక్కరోజులో ఏకంగా రూ.1300 ఎగబాకగా.. ప్రస్తుతం రూ.81,800 మార్కుకు చేరింది. దీంతో ఇప్పుడు బంగారం, వెండి కొనాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement