Friday, November 22, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ మార్కెట్లు సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక వెండి ధర కూడా కుప్పకూలుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇటీవల రికార్డు గరిష్టాల నుంచి వరుసగా దిగొస్తుంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 1933 డాలర్ల వద్ద ఉండగా.. అదే స్పాట్ సిల్వర్ 22.67 డాలర్లకు పతనమైంది. రూపాయి విలువ కూడా కాస్త మెరుగైంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చి చూస్తే రూ.81.97 వద్దకు చేరింది. దీంతో ఇప్పుడు బంగారం, వెండి కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే మంచి సమయం అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం రేట్లు ఇటీవల పడుతూనే ఉన్న విషయం తెలిసిందే. జీవనకాల గరిష్టాల నుంచి భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గగా 10 గ్రాములకు రూ. 54,700 వద్ద ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 330 పడిపోగా.. 10 గ్రాములకు ప్రస్తుతం రూ.59,670కి చేరింది. దేశ రాజధానిలో కూడా పుత్తడి రేటు పతనం కొనసాగుతోంది.

ఇక్కడ 10 గ్రాములకు రూ.300 పడిపోగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 వద్ద ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే రూ.330 తగ్గి 10 గ్రాములకు రూ.59,820 వద్ద ట్రేడవుతోంది.వెండి రేట్ల విషయానికి వస్తే కుప్పకూలిపోతున్నాయి. హైదరాబాద్‌లో తాజాగా ఒక్కరోజులోనే సిల్వర్ ధర రూ.2100 పడిపోవడం గమనార్హం. దీంతో కేజీ వెండి ధర ఒక్కసారిగా రూ.76,500కు దిగొచ్చింది. రెండు రోజుల కింద కూడా ఒక్కరోజులోనే రూ.5300 పడిపోగా.. తర్వాత మళ్లీ రూ.5500 పెరిగింది. మరోవైపు దిల్లీలో వెండి రేట్ల విషయానికి వస్తే తాజాగా రూ.1000 పడిపోయింది. దీంతో ఇప్పుడు కిలో సిల్వర్ రేటు ఇక్కడ రూ.73 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. సాధారణంగా బంగారం, వెండి ధరలు అంతటా ఒకేలా ఉండవు. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వెండి రేట్లు మాత్రం దిల్లీలో చాలా చాలా తక్కువలో లభ్యమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement