Monday, November 25, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. స్థిరంగా వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 మేర పెరిగింది. దీంతో రూ.49,500కు చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.220 మేర ఎగబాకి ప్రస్తుతం రూ.54 వేలకు చేరింది. గత 10 రోజులుగా చూస్తే రెండు సార్లు మాత్రమే గోల్డ్ ధర పతనమైంది. ఈ సమయంలో రూ.1300కుపైగా రేటు పెరగ్గా.. రూ.400 మేర తగ్గింది. వెండి విషయానికి వస్తే ఇది గరిష్ట విలువల వద్దే కొనసాగుతోంది. క్రితం రోజు కిలోకు రూ.1700 మేర తగ్గగా.. మరుసటి రోజు రూ.200 మేర పెరిగింది.

దీంతో ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో సిల్వర్ రేటు రూ.71 వేలకు చేరింది. దిల్లీలో మాత్రం వెండి ధర పడిపోయింది. మరో రూ.500 తగ్గి అక్కడ రేటు రూ.65,500 వద్ద ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధానిలో సిల్వర్ రేట్లలో భారీ తగ్గుదల కనిపిస్తుంది.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1782 డాలర్లకు పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ ధర 22.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ.82.33 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement