Tuesday, November 26, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. పెరిగిన వెండి

నేటి బంగారం ..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. డాలర్ పెరుగుతుండగా.. రూపాయి విలువ పతనం అవుతూ వస్తోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత తగ్గింది. ప్రస్తుతం రూ.82.42 లెవెల్స్ వద్ద ఉంది. ఇది మరింత పతనం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే అదే జరిగే ఆస్కారం ఉంది. యూఎస్ ఫెడ్ సమావేశం డిసెంబర్ 13-14 తేదీల్లో ఉండనుంది. మన బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 300 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.49 వేల 300 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.330 మేర పడిపోయి రూ. 53 వేల 780 వద్ద ట్రేడవుతోంది.

అయితే అంతకుముందు వరుసగా 6 రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.1100 మేర ఎగబాకింది. ఇప్పుడు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఇక సిల్వర్ రేటు చూస్తే ఇటీవల రూ.72 వేల మార్కు పైకి చేరడం గమనార్హం. కానీ ఒక్కసారిగా మళ్లీ భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఏకంగా రూ.1700 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి మన దగ్గర రూ. 70 వేల 800 వద్ద ఉంది. అంతకుముందు రోజు ఆల్ టైం హై వాల్యూ రూ.72,500కు చేరింది. ప్రస్తుతం రేటు తగ్గడానికి ముందు వరుసగా 5 సెషన్లలో వెండి ధర ఏకంగా రూ.4500 మేర పెరగడం ఆందోళన కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement