వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. కాగా మే 25న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 660 ర్యాలీ చేసింది. రూ. 52,090కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 600 పెరిగింది. దీంతో ఈ ఆర్నమెంటల్ పసిడి రేటు రూ. 47,750కు చేరింది. బంగారం ధర నిన్న కూడా పెరిగింది. దీంతో పసిడి రేటు కేవలం 2 రోజుల వ్యవధిలో రూ.760 మేర పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. అమెరికా డాలర్ మళ్లీ పుంజుకుంది. అలాగే అక్కడి స్టాక్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. వీటి వల్ల బంగారం ధర పెరుగుదల పరిమితంగానే ఉండిపోయింది. అయితే పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్ మాత్రం తగ్గాయి. ఇది పసిడి రేటుకు సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర నేలచూపులు చూసింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1862 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధరలు పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం వెలవెలబోతోంది. సిల్వర్ ధర ఈరోజు పడిపోయింది. కేజీ వెండి రేటు రూ. 400 దిగి వచ్చింది. దీంతో సిల్వర్ రేటు రూ. 66,100కు పడిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement