Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్స్‌కు తాజాగా రూ.100 పడిపోయింది. దీంతో ఇప్పుడు బంగారం రేటు రూ.55,800కు చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఇది ఒక్కరోజు రూ.110 పడిపోయి 10 గ్రాములకు ప్రస్తుతం రూ.60,870 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు ఇది రూ.380 మేర పడిపోయింది. ఇక దిల్లీలో కూడా గోల్డ్ రేటు పడిపోయింది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములక 100 రూపాయలు తగ్గి రూ. 55,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.110 పతనమై రూ.61,020 మార్కుకు చేరింది.ఇక సిల్వర్ రేట్ల విషయానికి వస్తే దిల్లీలో తాజాగా రూ. 110 పెరగ్గా కిలోకు ప్రస్తుతం రూ.76,600కు చేరింది. ఇది హైదరాబాద్‌లో చాలా ఎక్కువే ఉంది. ఒక్కరోజులో రూ.200 ఎగబాకి ప్రస్తుతం కిలోకు రూ.80,200 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం, వెండి ధరల్లో ప్రాంతాలను బట్టి వ్యత్యాసం ఉంటుంది. స్థానికంగా ఉండే పన్ను విధానాలే ఇందుకు కారణమని చెబుతుంటారు నిపుణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement