Saturday, November 23, 2024

నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు – పెరిగిన వెండి రేటు

నేటి బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు కూడా అదే దారిలో నడిచాయి. మే 17న కూడా బంగారం ధరల్లో ఎలాంటి వ్యత్యాసం లేదు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం ధరలు 10 గ్రాములకు వరుసగా రూ. 50,450 వద్ద, రూ. 46,250 వద్ద ఉన్నాయి. అంటే బంగారం ధరలో రెండు రోజులుగా మార్పు లేదు. అయితే సిల్వర్ రేటు మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర ఈరోజు రూ. 800 పైకి చేరింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 64,500కు చేరింది. వెండి కొనాలని యోచించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 1821 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి రేటు ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 21.58 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement