Tuesday, November 26, 2024

స్థిరంగా బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి..అయితే వెండి రేటు మాత్రం పెరిగాయి.. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 47,750గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 వద్ద పలుకుతోంది. అయితే వెండి రేటు మాత్రం రూ.400 పెరిగి రూ.67 వేలకు చేరుకుంది. విజయవాడలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.47,750 వద్ద రికార్డయింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అటు వెండి రేటు విజయవాడలో కేజీ రూ.66,600 నుంచి రూ.67 వేలకు పెరిగింది. అయితే ఈ వారమంతా చూసుకుంటే మాత్రం బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది. వారం ప్రారంభంలో అంటే మే 23, 2022న 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.47,150గా ఉంటే.. వారం చివరిలో నేడు ఆ ధర రూ.47,750గా రికార్డయింది. అంటే రూ.600 మేర ఈ ధర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా రూ.51,430 నుంచి రూ.52,090కు ఎగిసింది. ఈ ధరలో కూడా రూ.660 మేర పెరుగుదల నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement