Friday, November 22, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – స్థిరంగా సిల్వ‌ర్ రేటు

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. జూన్ 22న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 క్షీణించింది. దీంతో ఈ రేటు రూ. 47,650కు దిగి వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాములకు రూ. 100 తగ్గుదలతో రూ. 51,980కు పడిపోయింది. వెండి రేటు విషయానికి వస్తే నిలకడగానే కొనసాగుతోంది. సిల్వర్ రేటు ఈరోజు కూడా స్థిరంగానే ఉంది.

అంటే వెండి రేటులో మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.39 శాతం పడిపోయింది. 1831 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటును గమనిస్తే.. 1.06 శాతం పడిపోయింది. ఔన్స్‌కు 21.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement