Tuesday, November 19, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. కాగా వెండి ధ‌ర‌లు కొండెక్కాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.20 తగ్గి రూ.46,730గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.20 తగ్గి రూ.50,980గా ఉంది. బంగారం ధర తగ్గిన ఈ సమయంలో వెండి రేటు భారీగా పెరిగింది. కేజీ వెండి రేటు రూ.1000 వరకు పెరిగి రూ.62,400 వద్ద నమోదైంది. దీంతో రెండు రోజుల్లోనే రూ.2 వేల మేర వెండి ధర ఎగిసింది. విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలలో ఇదే రకమైన ట్రెండ్ కనిపించింది. వెండి రేటు భారీగా రూ.1000 మేర పెరిగి రూ.62,400గా నమోదైంది. అలాగే బంగారం ధర విజయవాడలో 22 క్యారెట్లకు చెందినది రూ.20 తగ్గి రూ.46,730గా, 24 క్యారెట్లకు చెందినది రూ.20 తగ్గి రూ.50,980గా రికార్డయ్యాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.1,800 మేర పెరిగి రూ.57 వేలకు చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గి రూ.46,880 వద్ద ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.51,140గా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement